Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏకగ్రీవమైన జీపీలు

ఏకగ్రీవమైన జీపీలు

- Advertisement -

సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులు
నవతెలంగాణ- విలేకరులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామపంచాయతీ పాలకవర్గాల ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మొదటి విడత 19 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వైరా మండలంలో స్నానాల లక్ష్మీపురం, పుణ్యపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం మండలంలో రాములు తండా, మల్లేపల్లి, రేగుల చలక, మంగ్లీ తండా, ఎర్రుపాలెం మండలంలో జమలాపురం, కాచవరం, గట్ల గౌరారం, చొప్పకట్లపాలెం, కండ్రిక, రామన్నపాలెం, మధిర మండలంలో సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, బోనకల్‌ మండలంలో కలకోట, చింతకాని మండలంలో రాఘవాపురం, రేపల్లెవాడ, గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అదే విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చంద్రాల బోడు, దుమ్ముగూడెం మండలంలో దుమ్ముగూడెం, గంగోలు, కమలాపురం, కోయ నర్సాపురం, కొత్తూరు, బూర్గంపాడు మండలంలో కృష్ణసాగర్‌, లక్ష్మీపురం, నకిరేపేట, మొరంపల్లి బంజార, పినపాక మండలంల జగ్గారం, పాత రెడ్డిపాలెం, కృష్ణాపురం గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో కంకణాలపల్లి, మర్రిగూడెం, సోమోరిగూడెం గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

వార్డు సభ్యురాలుగా సమంత ఈశ్వర్‌నాయక్‌ ఏకగ్రీవం
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం దేవునిబండ తండా ఏడో వార్డు సభ్యురాలుగా సీపీఐ(ఎం) మండల కన్వీనర్‌ ఈశ్వర్‌నాయక్‌ సతీమణి సమంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రిటర్నింగ్‌ అధికారి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాన్ని సమంత ఈశ్వర్‌కు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -