జిల్లా సహకార అధికారి, మాలోత్ సర్దార్ సింగ్
నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆకస్మికంగా, జిల్లా సహకార అధికారి మాలోత్ సర్దార్ సింగ్ శుక్రవారం కస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార ఎరువుల సరఫరా పై పరిశీలించారు. ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. యూరియా ప్రతి రైతుకి ఎన్ని బస్తాలు, యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరాలు తనిఖీ చేసినారు.
ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి మాలోత్ సర్దార్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుత పంట వేసిన రైతులకి పంటకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయాలని సూచించారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లయితే, అట్టి సొసైటీ సిబ్బంది పై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పులి సంపత్ గౌడ్, సీఈవో స్వాతి, పిఎసిఎస్ డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి, జగన్, గంగారం మాజీ సర్పంచ్ బడే రాంబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘమును ఆకస్మిక తనిఖీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES