Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ లో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్ తనకి నిర్వహించారు. కాటాపూర్ లోని ఓ సి డి ఎం ఎస్, మహాలక్ష్మి, మిగతా ఫర్టిలైజర్ షాపులలో స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను పరిశీలించారు. అనంతరం స్టాక్ రూమ్ లోకి వెళ్లి ఎరువు బస్తాలను పరిశీలించారు. రైతులకు ఎరువులు ఈపాస్ మిషన్ ద్వారా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులను విక్రయించాలని సూచించారు. దుకాణాలలోని నిలువల రిజిస్టర్ లను పరిశీలించారు. డీలర్లు ఎరువుల, పురుగుల, విత్తనాల స్టాక్ బోర్డులను రైతులు కనబడే విధంగా ప్రదర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులు ఈ వర్షాకాల సీజన్లో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని డీలర్ల నుంచి రసీదును తప్పక తీసుకోవాలని సూచించారు. రసీదు, విత్తన ప్యాకెట్లను భద్రపరచాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -