Tuesday, October 28, 2025
E-PAPER
Homeఖమ్మంమున్సిపాల్టీ పరిధిలో అనుమతి లేని ప్రచారం నిషేధం

మున్సిపాల్టీ పరిధిలో అనుమతి లేని ప్రచారం నిషేధం

- Advertisement -

– అతిక్రమించిన వారిపై మున్సిపాల్టీ యాక్ట్ అమలు
– కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలో అనుమతి లేని ప్రచారం, ప్లెక్సీలు, రాజకీయ పార్టీ,కుల సంఘాల జెండాలు ప్రదర్శించడం నిషేదం అని కమీషనర్ నాగరాజు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల అధ్యక్షులు,కుల సంఘాల అధ్యక్షులు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

పార్టీ, కుల సంఘాల కు చెందిన కార్యకలాపాల నిమిత్తం పురపాలక సంఘం అశ్వారావుపేట పరిధిలో ఎటువంటి అనుమతి లేకుండా పార్టీ/కుల పోస్టర్లు అంటించడం గాని పార్టీ/కుల జెండాలు కట్టడం గాని పార్టీ/కులాల కి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గాని పురపాలక సంఘం అశ్వారావుపేట కమిషనర్ అనుమతి లేకుండా పైన ఉదాహరించిన వాటిని అంటిచడం గాని పెట్టడం గాని ఏర్పాటు వేయటం గాని చేయరాదు అని హెచ్చరించారు.

అనుమతి లేకుండా పార్టీ కార్యకలాపాలకు చెందిన పోస్టర్స్ అంటించడం గాని ఉంచడం గాని,కట్టడం గాని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గాని చేసి నిబంధనలు అతిక్రమించిన వారి పై మున్సిపల్  యాక్ట్ 2019 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -