ఆందోళనలో లబ్ధిదారుల
నవతెలంగాణ – మల్హర్ రావు
వంట గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ప్రకటించిన రాయితీ సొమ్ము అందడం లేదు. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. సుమారు ఐదారు నెలలుగా ఈ రాయితీ డబ్బులు లబ్దిదారుల అకౌంట్లలో జమకావడంలేదని లబ్దిదారులు వాపోతున్నారు. మండలంలో 8013 సిలిండర్లకు సుమారు రూ.12.50 లక్షల వరకు సబ్సిడీ పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.మొత్తం దరఖాస్తులు 8978 వచ్చాయి.2024లో ఫిబ్రవరిలో ప్రారంభమైయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం అమలు చేస్తోంది. గ్యాస్ ” వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందించే ఉద్దేశంతో 2024 ఫిబ్రవరిలో పథకాన్ని ప్రారంభించారు. సిలిండర్ నింపిన తర్వాత లబ్దిదారుల అకౌంట్లలో ఈ సొమ్మును ప్రభుత్వం జమచేసేది.
మొదట్లో బాగానే అందించినా.. రానురాను ఈ పథకం కింద గ్యాస్ రాయితీ రావడం లేదని లబ్దిదారులు చెబుతున్నారు. మండలంలో ఇండియన్ కంపెని ఏజెన్సీ పరిధిలో మొత్తం 8,013 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సింగిల్ కనెక్షన్లు 7,785, డబుల్ సిలిండర్ కనె క్షన్లు 895, దీపం కనెక్షన్లు 1633,ఉజ్వల కనెక్షన్లు 1776,సీఎస్ఆర్ కనెక్షన్లు1937 ఉన్నాయి. గ్రామాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి 6 నుంచి 8 సిలిండర్ల వరకు వినియోగిస్తుంటారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ల స్కీం అమలై దాదాపు 20 నెలలవుతోంది.
అందని గ్యాస్ రాయితీ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES