– కాంగ్రెస్ ‘జనహితయాత్ర’ను అడ్డుకునేందుకు చిల్లరచేష్టలు
– బీఆర్‌ఎస్ పార్టీకి కేడరే సరిగా లేదు..
– ఉన్నవాళ్లకు డబ్బులిచ్చి యాత్రను అడ్డుకునే కుట్ర
– ప్రజలకు ఎళ్లప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– రేపు ఉప్పరమల్యాల నుంచి గంగాధర వరకు భారీ జనసందోహంతో యాత్ర
– చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి’
మా పార్టీ ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ నేతృత్వంలో కాంగ్రెస్ అధిష్టానం చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజల చూపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డుకునేందుకు చిల్లరచేష్టలకు పూనుకుంటోంది. బీఆర్‌ఎస్‌లో కేడర్ ఖాళీ అవుతోంది. ఉన్న కేడర్‌కు డబ్బులు ఇచ్చి మరీ యాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. పదేండ్లలో గత ప్రభుత్వం తమ నియోజకవర్గాన్ని నాశనం చేస్తే మేము దాన్ని సరి చేసుకుంటూ ప్రజల అవసరాలు తీర్చుతున్నాము. ప్రజలకు ఎళ్లప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నేడు ఉప్పర మల్యాల నుంచి గంగాధర వరకు చేపట్టబోయే యాత్ర భారీ జనసందోహంతో సాగనుంది.’ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చొప్పదండి నియోజకవర్గంలో నేడు ‘జనహిత పాదయాత్ర’ ప్రారంభం కానుందని, ఈ పాదయాత్రకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా ప్రజలను నేరుగా కలిసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి ఏ విధంగా చేరుతున్నాయో తెలుసుకుంటామని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం, యువతకు 60 వేల ఉద్యోగాలు ఇవ్వడం వంటివి తమ ప్రభుత్వం సాధించిన విజయాలని ఆయన గుర్తు చేశారు.కేటీఆర్‌పై తీవ్ర విమర్శలుఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కేటీఆర్ ఒక థర్డ్ క్లాస్ ఫెల్లో’ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీరు ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చి ఉంటే తాను ముక్కు నేలకి రాస్తానని సవాల్ విసిరారు. గాయత్రీ పంప్‌హౌస్‌కి దగ్గర్లో ఉన్న గ్రామాలకు కూడా నీళ్లు అందలేదని అన్నారు. కొండగట్టు దేవస్థానం అభివద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మేడిపల్లి సత్యం విమర్శించారు. కెటిఆర్ ఇక్కడి స్థానిక నాయకులకు డబ్బులిచ్చి తమ కార్యక్రమాలకు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇటువంటి చిల్లర రాజకీయాలతో తమను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఓర్వలేకనే కుట్రలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES