Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆగని ఇజ్రాయిల్‌ దాడులు

ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

24 మంది పాలస్తీనియన్ల మృతి
గాజా :
ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ఇజ్రాయిల్‌ దళాలు సోమవారం గాజాపై విరుచుకుపడ్డాయి. సహాయం కోసం శిబిరాల వద్ద బారులు తీరిన అన్నార్తులపై కూడా అమానుషంగా దాడులు చేశాయి. తాజా దాడుల్లో 24 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల కాలంలో కనీసం 105 మృతదేహాలు, 356 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకొచ్చారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గతంలో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ మార్చి 18న ఉల్లంఘించింది. అప్పటి నుంచి కనీసం 6,964 మంది పాలస్తీనియన్లు చనిపోగా 24,576 మంది గాయపడ్డారు. 2023లో గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ 57,523 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. 1,36,617 మంది గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుబడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌ దళాలు తాజాగా బెయిట లహియాపై డ్రోన్‌ దాడి జరిపాయి. సెంట్రల్‌ గాజా సిటీలోని అల్‌-ఫవాఖిర్‌ వీధిపై కూడా దాడి జరిగింది. గాజా సిటీకి పశ్చిమాన ఉన్న అల్‌-నజర్‌లోని అల్‌-షిఫా వీధి పైనా ఇజ్రాయిల్‌ దాడి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -