Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeకవితమార్పు రాని పాలినేషన్‌

మార్పు రాని పాలినేషన్‌

- Advertisement -

చాలాసార్లు
పువ్వుపై పక్షి వాలగానే
పుప్పొడి రేణువులు
కాముడితో మనువిదే
అన్నట్టుగా తనువుతో
పోలెన్‌ గ్రెయిన్స్‌ ను స్వీకరిస్తాయి
పూ మొగ్గలకు ప్రాణం పోస్తాయి.
కొన్నిసార్లు
గాలి పలకరింపుకి
పరాగ రేణువులు
ఇదే ప్రణయ రాగం
అన్నంతగా రమించి
పరాగ సంపర్కంతో
లక్షల పూలకు జన్మనిస్తాయి.
ఇంకొన్నిసార్లు
వర్షపు స్పర్శకి
పువ్వులోని ప్రతి అణువూ
జన్మ సార్థకమంటే ఇదే
అనేంత అనురాగ బంధంతో
పరిమళాన్ని అద్దుతాయి
పూల సంతతిని పెంచుతాయి.
పూత పూసిన మహిళ సైతం
ఏ ప్రాణీ ఇవ్వని కట్నమనే
అదనపు పరిమళాన్ని
లక్షల కౌంట్లలో అద్దినా
ఒడిలోకి రాని కాయకు కారణం
”ఎస్‌ కౌంట్‌ ” కాదంటారు
మరి పాలినేషన్‌
స్త్రీత్వం వల్ల జరగక
అదనపు పరిమళంతో
జరిగిందేమో మరి.
అదనపు పరిమళాలు
కిలోల కొద్దీ అద్దినా
అదేంటో మరి
జీవితానికి ఒక్క కాయ
పండించడం టూ కాస్ట్లీపని!!
ప్రకతికి మాత్రం స్పర్శిస్తే
లక్షల బిడ్డలు
అది కూడా ఉచితంగానే !!
– మృదుల, 7093470828

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad