Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్ఇందిరమ్మ ఇళ్ల సాకుతో అడ్డదారి పడుతున్న సన్నపు ఇసుక

ఇందిరమ్మ ఇళ్ల సాకుతో అడ్డదారి పడుతున్న సన్నపు ఇసుక

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని గోదావరి తీరప్రాంతాలు, పెద్దవాగు పరిసర గ్రామాల నుండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో సన్నపు ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా రవాణా చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు కళ్లుమూసుకున్న తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇసుక దళారులు మరింత దూకుడుగా మారారు. పట్ట పగలే ట్రాక్టర్లతో పట్టణానికి ఇసుకను తరలిస్తుండగా, మార్కెట్‌లో ఒక్కో ట్రిప్పుకు 6వేల నుండి 8వేల వరకు ధర వసూలు చేస్తున్నట్లు సమాచారం.ఇందిరమ్మ ఇళ్ల సాకు తో ఇసుక మాఫియాలు భారీగా అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నాయి.అధికారులు వెంటనే స్పందించి,ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్న ఈ అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -