Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ విద్యార్థులకు చార్టర్డ్ అకౌంటింగ్ పై అవగాహన..

ఇంటర్ విద్యార్థులకు చార్టర్డ్ అకౌంటింగ్ పై అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో సి ఈ సి చదువుతున్న విద్యార్థులకు చార్టర్డ్ అకౌంటింగ్ పై గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్   ఇప్పకాయాల రమేష్  హాజరై విద్యార్థులకు సిఎ,  సిపిటిపై అవగాహనా కల్పించారు . ఈ సందర్బంగా  ఇప్పకాయాల రమేష్  మాట్లాడారు.

వ్యాపార,  వాణిజ్య రంగంలో చార్టర్డ్ అకౌంట్ పూర్తి చేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచడంలో చార్టర్డ్ అకౌంట్స్ యొక్క పాత్ర కీలకమైనదని తెలియజేసారు. కళాశాల  కరస్పండెంట్  కేశి రెడ్డి గురువెందర్ రెడ్డి  మాట్లాడుతూ శ్రీ  ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో సి ఈ సి చదివే విద్యార్థులకు సీఏ, సీపీటీ   పై అవగాహనా కల్పించి భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి చెరే విధముగా కృషి  చేస్తామన్నారు. ఈ కార్యక్రములో కళాశాల ప్రిన్సిపల్  లోకోటి హన్మంతరావు , వైస్ ప్రిన్సిపల్ కొలిమి సురేష్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు వైద్యచందు, లక్ష్మిపతి , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -