- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించడానికి ప్రత్యేక యాప్ లో నమోదు ప్రక్రియపై గురువారం రాష్ట్ర వ్యవసాయ కమిషనర్, వ్యవసాయ డైరెక్టర్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని కొయ్యుర్ రైతు వేదికలో వ్యవసాయ జిల్లా అధికారి జె.బాపు,సంచాలకులు రమేష్ , శ్రీపాల్, మహాదేవపూర్ ఉద్యానవన అధికారులు, మండల శ్రీజ వీక్షించి రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ వానకాలంలో పంట నమోదు ప్రక్రియ, ప్రత్తి అమ్మకానికి కాప్స్ కాటన్ యాప్ యొక్క ప్రాధాన్యత, వినియోగం, సమగ్ర వ్యవసాయ యాంత్రీకరణ గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు,రైతులు పాల్గొన్నారు.
- Advertisement -