– రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలి
– ఎరువుల బుకింగ్ యాప్ చేసుకునే ప్రతి రైతుకు యూరియాని ఇవ్వాలి
– ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతులకు ఎరువుల బుకింగ్ యాప్ పై ఎరువుల షాపు డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు నెల్లికుదురు మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని ఇనుగుర్తి, నెల్లికుదురు మండల డీలర్లకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆదేశానుసారం రేపటి నుండి మన మహబూబాబాద్ జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు చేపట్టాలని దానికనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు.
మన మహబూబాబాద్ జిల్లా, మిగతా ఐదు జిల్లాలలో రేపటి నుండి కేవలం యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరిగే క్రమంలో మన మండలంలో యూరియా బుకింగ్ చేసుకున్న రైతులకే ఎరువులు సరఫరా చేయాలని ఎటువంటి లింకులు పెట్టకుండా ఇవ్వాలని సూచించారు. దీనికి గ్రామాలలో ఉన్న యువత వాలంటీర్స్ గా ముందుకు వచ్చి తోటి రైతులకు యూరియా బుకింగ్ చేసే విధంగా సహాయం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇనుగుర్తి నెల్లికుదురు మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రెండు మండలాలకు చెందిన ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.



