నవతెలంగాణ-భిక్కనూర్ : సమాజంలో ప్రజల దైనందిన జీవితంలో స్థల సమాచార సాంకేతికతల ప్రాముఖ్యతను నిపుణులు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రామ్మూర్తి సోమ తెలిపారు. బుధవారం మండలంలోని బిటిఎస్ వద్ద సౌత్ క్యాంపస్ లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంబంధిత సాంకేతికతలు డిజిటల్ మార్కెటింగ్, నావిగేషన్ వంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయని తెలిపారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్రో వంటి నావిగేషన్ సేవలు, అలాగే ఉబర్, స్విగ్గి వంటి యాప్‌ల ద్వారా ఈ సాంకేతికతలు సాధారణ ప్రజల జీవితంలో భాగమయ్యాయని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి సాంకేతికతలపై అవగాహన కల్పిస్తూ, పొందిన జ్ఞానాన్ని తమ ప్రాజెక్టుల్లో వినియోగించి మెరుగైన విశ్లేషణలు చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగాధిపతి డాక్టర్ సబిత, బీఓఎస్ డాక్టర్ కవిత తోరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. నారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరీ, హాస్టల్ వార్డెన్ జి. సునీత, ఏపీఆర్వో డాక్టర్ సరిత పిట్ల, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ లలిత, డాక్టర్ అంజయ్య, డాక్టర్ నాగరాజు తదితరులు, వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
స్పేషియల్ టెక్నాలజీల ప్రాముఖ్యతపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



