Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నానో యూరియా వాడకంపై అవగాహన 

నానో యూరియా వాడకంపై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని పోచంపల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై రైతులకు మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అవగాహన కల్పించారు. అనంతరం ఏఈవో విశ్వశాంతి తో కలిసి మాట్లాడుతూ.. వ్యవసాయంలో నానో టెక్నాలజీ సాంప్రదాయ ఎరువుల స్థానాన్ని భర్తీ చేస్తుంద‌న్నారు. దీంతో మెరుగైన పంట ఉత్పాదకత ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. నానో యూరియాను రెండుసార్లు పిచికారి చేయాల‌న్నారు. ఒక ఎకరానికి అర లీటరు సరిపోతుంద‌ని, సాంప్రదాయ యూరియా తో పోల్చితే నానో యూరియా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు. రైతులు నానో యూరియా వినియోగంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -