నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో రైతులకు యూరియా బుకింగ్ ‘మొబైల్ యాప్ పై శనివారం, వ్యవసాయాధికారి రాకేష్ అవగా హన కల్పించారు. గత పంటకాలంలో జరిగిన సమస్యలు పునరా వృతం కాకుండా ప్రభుత్వం కొత్తగా యూరియా బుకింగ్ యాప్ను తీసుకువచ్చిందని తెలిపారు. రైతు ఇంటి వద్ద ఉండే ఈ యాప్ ద్వారా తన దగ్గరలో ఉన్న దుకాణాలలో ఎంతమేర యూరియా నిల్వ ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. రైతులు యూరియా కొరత ఉందని అపోహలో భయాందోళనలో దుకాణాలకు వెళ్లి యూరియా కొనాల్సిన అవసరం లేదన్నారు. పంట పండించిన నిజమైన రైతులు మాత్రమే తమకు నచ్చిన దుకాణానికి వెళ్లి కొనుక్కునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. యూరియా పంపిణీ రైతులు వేసిన పంట లను బట్టి సముచితంగా పారదర్శకంగా పంపిణీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
యూరియా బుకింగ్ పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



