30 మంది నామినేషన్లు వేస్తాం : నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ కాశీనాథ్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండ్లవుతున్నా ఉద్యోగాలు ఇవ్వడం లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉంటామని నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ కాశీనాథ్ ప్రకటించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడం లేదని, ఉద్యోగ నోటిఫికేషన్ లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ వేసి జూబ్లీహిల్స్‌లో ఎన్నికలకు వెళ్లాలని, లేనిపక్షంలో దాదాపు 1000 మంది నిరుద్యోగులతో తరలివచ్చి 30 మంది వరకు నామినేషన్‌లు వేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు భూక్య రవి కుమార్, ఆర్‌కె వున్నారు చోళ ఉన్నారు.
జూబ్లీహిల్స్ బరిలో నిరుద్యోగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES