Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజాబ్‌ క్యాలెండర్‌ కోసం నిరుద్యోగల ఆందోళన..

జాబ్‌ క్యాలెండర్‌ కోసం నిరుద్యోగల ఆందోళన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: అశోక్‌నగర్‌లోని సెంట్రల్‌ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. కేంద్ర గ్రంథాలయం నుంచి అశోక్‌నగర్‌ చౌరస్తాకు ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొత్త మంది అభ్యర్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -