Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీ పాలనలో పెరిగిన నిరుద్యోగం

మోడీ పాలనలో పెరిగిన నిరుద్యోగం

- Advertisement -

– ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ ధ్వంసం : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– మితవాద ఉద్యమాలను తిప్పికొట్టాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

మోడీ పాలనలో నిరుద్యోగం పెరి గిందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నిం టినీ ధ్వంసం చేశారని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. 2026 జనవరి 18, 19, 20 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరగనున్న డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా మంగళవారం ఇబ్రహీం పట్నంలో ఆహ్వాన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం చెందా యని అన్నారు. స్వప్రయోజనాల కోసమే ఇతర సంఘాలు పని చేస్తున్నాయని తెలిపారు. డీవై ఎఫ్‌ఐ దేశ సమగ్రతను కాపాడుతూ ముందుకు సాగుతున్నదని అన్నారు. ప్రజాతంత్ర ఉద్యమాల్లో అనేకమంది యువకిశోరాలు ప్రాణత్యాగం చేశా రని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా పేరుగాంచిన చైనా పారిశ్రామిక, వ్యవ సాయ రంగంలో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. నిరుద్యోగం లేకుండా చేస్తున్నదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని, ఇటీవల జరిగిన బీహార్‌ ఎన్నికల్లో అది బట్టబయలైం దన్నారు. అడ్డదారుల్లో అధికారం లోకి వస్తున్న బీజేపీని అడ్డుకో వాల్సిన అవసరం ఉందని యువతకు పిలుపు నిచ్చారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను తొలగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో చరిత్ర కనుమరుగవు తుందని, పాఠ్యాంశాలను సైతం మారుస్తూ యువతను అడ్డదారుల్లో నడిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మితవాద ఉద్యమాలు ముందుకు వస్తున్న తరుణంలో డీవైఎఫ్‌ఐ.. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో విద్యారంగాన్ని విషపూరితం చేస్తోందని తెలిపారు. ప్రశ్న అనేది లేకుండా చేసే ఆలోచనగా దోపిడీ వర్గాలు ముందుకు వస్తున్నాయన్నారు. ప్రశ్నించే గొంతు లను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోం దన్నారు. ప్రపంచం సంక్షోభంలోకి వెళ్తోందని, యువత ఈ పరిణామాలపై నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదికి 3.50 లక్షల మంది డిగ్రీ సర్టిఫికెట్లు పొందుతున్నా రని, వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రభు త్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఇలాంటి తరుణంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు.

ఎన్నికైన ఆహ్వాన కమిటీ
ఆహ్వాన కమిటీ చైర్మెన్‌గా ఆర్‌.వెంకట్రావ్‌, వైస్‌ చైర్మెన్‌గా డి.జగదీష్‌, కార్య దర్శిగా ఆనగంటి వెంకటేష్‌, కోశాధికారిగా పి.జగన్‌, గౌరవ సలహాదారులుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర, అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనంగంటి వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి పి.జగన్‌, మాజీ జడ్పీటీసీ పి.యాదయ్య, డీవైఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సామెల్‌, ప్రకాష్‌ కరత్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్‌, వ్యకాస జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.జగదీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా నాయకులు అరుణ్‌కుమార్‌, తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -