Monday, November 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో ఆగని రక్తపాతం

గాజాలో ఆగని రక్తపాతం

- Advertisement -

కాల్పుల విరమణను పట్టించుకోని ఇజ్రాయిల్‌
తాజా దాడుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి
69 వేలు దాటిన మరణాల సంఖ్య

గాజా : ఇజ్రాయిల్‌ తన ఉన్మాద చర్యలతో గాజాలో మళ్లీ అలజడిని సృష్టించింది. ఇజ్రాయిల్‌ సైన్యం దాడులను కొనసాగించింది. తాజా దాడుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 69 వేలకు పైగా చేరుకున్నది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్నివెల్లడించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో గతనెల 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్‌ మాత్రం ఈ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ గాజాలో మానవహౌమానికి పాల్పడుతున్నది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఇజ్రాయిల్‌ శనివారం జరిపిన దాడుల్లో బురైజ్‌ శరణార్థ శిబిరంలో ఒక పాలస్తీనా వ్యక్తి, అలాగే ఉత్తర, దక్షిణ గాజాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023 అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటి వరకు గాజాలో మరణించిన వారి సంఖ్య 69,169కి చేరింది. కాల్పుల విరమణ అనంతరం కూడా ఇజ్రాయిల్‌ బలగాలు కనీసం 240 మందిని పొట్టనబెట్టుకున్నాయి. హమాస్‌ 2014లో గాజా యుద్ధ సమయంలో మృతి చెందిన ఇజ్రాయిల్‌ అధికారి హాదర్‌ గోల్డిన్‌ మృతదేహాన్ని రఫా నగరంలో ఒక సొరంగం నుంచి వెలికి తీశారు. అదే ప్రాంతంలో ఆరుగురు పాలస్తీనా భద్రతా సభ్యుల మృతదేహాలు కూడా లభించాయని హమాస్‌ తెలిపింది.

గాజా, ఈజిప్ట్‌ మధ్యనున్న రఫా సరిహద్దును అత్యవసర వైద్య సేవల కోసం తిరిగి తెరవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 4000 మంది పాలస్తీనియన్‌ రోగులు రఫా సరిహద్దు ద్వారా గాజాను విడిచి ఈజిప్ట్‌, ఇతర దేశాల్లో చికిత్స పొందారు. 16,500 మంది పేషెంట్లు విదేశాల్లో వైద్యం పొందేందుకు ఎదురు చూస్తున్నారు. ఇక పశ్చిమ తీర ప్రాంతంలో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇజ్రాయిల్‌ సైనికులు, వలసదారుల దాడులు పెరిగాయి. పశ్చిమ నాబ్లస్‌ సమీపంలోని బీటా పట్టణంలో ఆలివ్‌ పంట కోయడానికి వెళ్లిన పాలస్తీనా రైతులపై ఇజ్రాయిల్‌ సెట్లర్లు దాడికి దిగారు. ఈ ఘటనలో రైతులతో పాటు పలువురు కార్యకర్తలు, జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌ వలసదారులు దాడి చేశారు. తమ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా గాయపడ్డారని ‘రాయిటర్స్‌’ తెలిపింది. ఐక్యరాజ్యసమితి సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ నుంచి 70 పట్టణాలు, గ్రామాల్లో 126 దాడులు నమోదయ్యాయి. 4000 కంటే ఎక్కువ ఆలివ్‌ చెట్లు, మొక్కలు ధ్వంసమయ్యాయి. కాగా ఇజ్రాయిల్‌ సైనికుల ఆయుధ నీడలో.. జెనిన్‌లో గల రాబా గ్రామంలోని పాలస్తీనియన్ల ఇండ్లపై ఇజ్రాయిల్‌ వలసదారులు దాడి చేశారని పాలస్తీనా వార్త సంస్థ వఫా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -