Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమాఊహించని రీతిలో..

ఊహించని రీతిలో..

- Advertisement -

యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. నిర్మాత దిల్‌ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ హక్కుల కోసం రికార్డ్‌ బ్రేకింగ్‌ డీల్‌ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదొక చారిత్రాత్మక డీల్‌గా నిలిచింది. ఏకంగా రూ.120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘టాక్సిక్‌’ ఓవర్సీస్‌ డీల్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విదేశీ పంపిణీదారులలో ఒకరైన ఫార్స్‌ ఫిల్మ్‌ ఈ మూవీని కొనుగోలు చేసింది. కమిషన్‌ ప్రాతిపదికన రూ.105 కోట్లు అడ్వాన్స్‌గా పొందారు. ఇది ప్రపంచ మార్కెట్‌ నుండి ‘టాక్సిక్‌’ మీద ఉన్న నమ్మకాన్ని చాటుతోంది.
ఫార్స్‌ ఫిల్మ్స్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు అహ్మద్‌ గోల్చిన్‌ మాట్లాడుతూ, ‘సరిహద్దులను దాటి ప్రతిధ్వనించే కథను చెప్పాలనే మా లక్ష్యం ‘టాక్సిక్‌’తో నెరవేరబోతోంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండటం మాకు ఎంతో గర్వకారణం. ఈ ఓవర్సీస్‌ విడుదల ఫార్స్‌ ఫిల్మ్‌కి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ‘టాక్సిక్‌’ తీవ్రత, భావోద్వేగ లోతును ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలని, అది మేం చూడాలని ఎంతో ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.
‘యూనివర్సల్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేందుకు మేం ‘టాక్సిక్‌’ను ఈ స్థాయిలో నిర్మించాం. మాకు అసాధారణమైన బలం, విశ్వసనీయత కలిగిన భాగస్వామి అవసరం. ఫార్స్‌ ఫిల్మ్స్‌ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ సినిమాను శక్తివంతంగా ఉంచడానికి అసమానమైన సామర్థ్యాన్ని నిరంతరం ప్రదర్శించింది. ఇలాంటి ఓ గొప్ప విదేశీ పంపిణీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం మాకు గర్వకారణం’ అని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అధినేత వెంకట్‌ కె నారాయణ చెప్పారు.
యశ్‌, గీతు మోహన్‌దాస్‌ కలిసి రాసిన కథను గీతు మోహన్‌దాస్‌ తన విజన్‌ను జోడించి దర్శకత్వం వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -