నవతెలంగాణ – రాయపోల్
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని తీవ్రంగా ధ్వంసం చేసి ఒకవైపు వంగిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న రాయపోల్ పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ధ్వంసమైన గాంధీ విగ్రహాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీం బృందమును రప్పించి ఫింగర్ ప్రింట్స్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



