నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో సమీపంలో ఒక గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు. సోమవారం ఉదయం కీమాను శ్రవణ్ కుమార్ లైన్ చెకింగ్ చేస్తున్న క్రమంలో, రైల్వే స్టేషన్ కు సుమారు 150 మీటర్ దూరంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించినట్లు రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. అతని వయస్సు అందాజ 30 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని, నలుపు రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు ఆకాశం నీలం రంగు నిలువగీతల అంగీ, అతని చేతి పైన ఐ లవ్ యు రాజ్ వెంకటేష్ లోకేష్ అను టాటూ మార్క్ ఉందని తెలిపారు. ఈ వ్యక్తి దాదాపు రెండు రోజుల క్రితం చనిపోయినట్లుగా ఉందని అంచనా ప్రకారం తెలిపారు.
మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి ఈ దిగు నెంబర్క 87126 70189, 8712670151.లకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహం ప్రస్తుతము ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ గదిలో ఉంచినట్లు తెలిపారు.



