Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిట్స్ వచ్చి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఫిట్స్ వచ్చి గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 3వ తేదీ ఉదయం సమయం 09:25 గంటలకు నిజామాబాద్ బస్టాండ్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ వచ్చి పడి ఉండగా పక్కన ఉన్న వారు అతన్ని గమనించి పోలీస్ వారికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది 108 ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ నిజామాబాద్ కు చికిత్స గురించి తరలించినారు.

వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి చూసి అడ్మిట్ చేశారు. ఇతను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ  తేదీ 9 ఉదయం 7:35 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతని వయసు సుమారు 50 నుండి 55 వరకు ఉంటుంది .ఇతని పేరు అశోక్ అని తెలిపారు. అతని పైన బట్టలు గోధుమ రంగు ఫుల్ షర్ట్ మరియు బ్లూ కలర్ నెక్కర్ ధరించాడు. వ్యక్తి వాలకం బట్టి కూలి పని చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది, ఇతని యొక్క జేబులు చెక్ చేయగా అతని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు.గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714 కు సంప్రదించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -