- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు సైతం యూనిఫామ్స్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని సెంటర్-5లో గ్రామ సర్పంచ్ బండి స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి శుక్రవారం చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ రేపాల అరుణ, చిన్నారులు, తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.
- Advertisement -



