- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామ ప్రత్యేకాధికారి బుధారపు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీపీ సిబ్బందిని ప్రజలు సులభంగా గుర్తించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు యూనిఫాం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధతను పెంపొందించడంలో యూనిఫాం కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. జీపీ సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు యూనిఫాం వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో కారోబార్ కుమారస్వామి, జీపీ సిబ్బంది సిద్దు, ఎల్లమ్మ, యాకమ్మ, సామంచ, రజిత, చంద్రయ్య, సాయి, సత్తయ్య, రాజు పాల్గొన్నారు.
- Advertisement -