Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూనిక్‌ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌

యూనిక్‌ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌

- Advertisement -

విష్ణు విశాల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘ఆర్యన్‌’, ప్రవీణ్‌ కె దర్శకత్వంలో విష్ణు విశాల్‌ స్టూడియోజ్‌, శుభ్రా, ఆర్యన్‌ రమేష్‌ సంయుక్తంగా నిర్మించారు. శ్రేష్ట్‌ మూవీస్‌ అధినేత సుధాకర్‌ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకుంది. ఈనెల 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

హీరో విష్ణు విశాల్‌ మాట్లాడుతూ, ‘తెలుగు ఆడియన్స్‌ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు నా సినిమాలు ‘రాక్షసన్‌, ఎఫ్‌ఐఆర్‌, మట్టి కుస్తీ’ని చాలా ప్రేమతో సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. యూనిక్‌ థ్రిల్లర్‌ ఎక్స్పీరియన్స్‌ ఉంటుంది. ఇలాంటి సినిమా చేయడం చాలా ఛాలెంజింగ్‌. తప్పకుండా ఆడియన్స్‌కి సీట్‌ ఎడ్జ్‌ అనుభవాన్ని ఇస్తుంది. ఈ సినిమా తమిళ్‌లో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగు ఆడియన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -