రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
మేకర్స్ బుధవారం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ,’రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాగే మాధవ్ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే చాలా మంచి పాయింట్ చుట్టూ నడిపారని అనిపిస్తుంది. సినిమా బాగుంటే కచ్చితంగా రవితేజ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరు కూడా చూస్తారు. టీజర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత ఎగ్సైటింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘నాగరాజు టీజర్‌ని అద్భుతంగా చూపిం చారు. ఈ స్క్రిప్ట్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. విహారి మ్యూజిక్ ఇరగదీశాడు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు’ అని హీరో మాధవ్ చెప్పారు.
హీరోయిన్ దీపా మాట్లాడుతూ,’ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా’ అని తెలిపారు. ‘ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇందులో చూపించిన మైసాపురం కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి కథ, పాత్రలు మా ఊర్లో కూడా జరిగింది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది’ అని అన్నారు. డైరెక్టర్ నాగరాజు చెప్పారు. కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి మాట్లాడుతూ,’సినిమాని ఒక ఆడియన్‌గా చూశా. ఎక్సలెంట్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’ అని అన్నారు.
యూనిక్ పాయింట్..
- Advertisement -
- Advertisement -



