- Advertisement -
హైదరాబాద్ : హీనెకెన్ గ్రూపులో భాగమైన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంగారెడ్డి జిల్లాలో తన ప్రతిష్టాత్మక కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘ప్రాజెక్ట్ జలశక్తి’ని ప్రారంభించింది. భారత్ కేర్స్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా మల్కాపూర్, కొత్లాపూర్ వంటి పలు గ్రామాల్లో పునరు త్పాదక ఇంధనంతో నడిచే రెండు ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు సంస్థ పేర్కొంది. ఈ కేంద్రాల ద్వారా రైతులకు భూసార పరీక్షలు, వాతావరణ సమాచారం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించనున్నామని తెలిపింది.
- Advertisement -


