ఎన్డీఏ ప్రజా వ్యతిరేక చట్టాల రద్దు కోసం పని చేస్తాం
ప్రజలలో ఐక్యత కోసం కృషి
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుల ప్రతిజ్ఞ
న్యూఢిల్లీ : వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కార్మికులకు, ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను, విధానాలను తిప్పికొట్టేందుకు అఖిల భారత స్థాయిలో ఐక్య పోరాటాలను నిర్మిస్తామనీ, ప్రతిఘటించేందుకు ప్రజలను సమీకరిస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ప్రతినబూనారు. వాటన్నింటినీ రద్దు చేసేవరకూ పోరాడతామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మూడు రోజుల సమావేశం శుక్రవారం తిరువనంతపురంలోని ఈఎంఎస్ అకాడమీలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఎం.ఏ బేబీ రాజకీయ పరిణామాలపై నివేదికను ప్రవేశపెట్టారు. ప్రతిజ్ఞ పూర్తి పాఠం ఇలా ఉంది.
ప్రతిజ్ఞ :బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను, విధానాలను రద్దు చేసే వరకు సీపీఐ(ఎం) తరఫున ప్రజల పక్షాన నిలబడి ప్రతిఘటించేందుకు ఐక్యంగా పనిచేయాలని మేము సంకల్పించాము. ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తామనీ, ప్రజల ప్రాథమిక హక్కులు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ప్రజానుకూల చట్టాలు, విధానాలు రూపొందించేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. విజయం సాధించే వరకూ నిరంతరాయంగా ఐక్య అఖిల భారత పోరాటాలను నిర్మిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం.
అఖిల భారత స్థాయిలో ఐక్య పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



