సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి : జె.వెంకటేష్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూనివర్సిటీలకు బడ్జెట్ పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద మహేందర్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరిస్తున్నదనీ, 2025-26 బడ్జెట్‌లో సరిపడే కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఉన్నత విద్యారంగాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలకు కట్టబెట్టేందుకు వీలుగా యుజీసీ నిబంధనలను సడలించడం, యూనివర్సిటీలకు గ్రాంట్లు సకాలంలో విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని యూనివర్సిటీల నాన్ టీచింగ్ సిబ్బంది ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది ఈ నెల 10 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమంలో నిర్వహించి యూనియన్లకతీతంగా సమ్మెను విజవయంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ నాయకులు సీతారాం తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీలకు బడ్జెట్ పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES