Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెలగని వీది దీపాలు

వెలగని వీది దీపాలు

- Advertisement -

  • నవతెలంగాణ- పెద్దకొడప్ గల్ 
  • మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వీధి దపాలు వెలుగకపోవడంతో గల్లీలు మొత్తం అంధకారంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగక పోవడం, కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో గ్రామాలు వీధి లైట్లు లేక అంధకారంలో మగ్గుతున్నాయి. పంచాయతీల్లో వీధిలైట్ల ఏర్పాటు, నిర్వహణ పాలకవర్గానికి సవాల్‌గా మారుతోంది. కొత్త వీధిలైట్లు కొందామంటే నిధులు లేవు. మరోవైపు ఇప్పటికే ఉన్న వీధిలైట్ల నిర్వహణ తలకుమించిన భారమైంది. వీధిలైట్లు ఆన్, ఆఫ్‌ వున్నా కొన్ని గ్రామాల్లో పగటిపూట కూడ వెలుగుతున్నాయి. దీంతో విద్యుత్ చార్జీల భారం పెరిగిపోతోంది. మరోవైపు విద్యుత వృథా అవుతోంది. వీధిలైట్లు లేని గ్రామాల్లో రాత్రిపూట అంధకారంలోనే కాలం గడుపుతున్నారు.
  • వెలగని వీధిదీపాలు 
  • మండల పరిధిలోని 23 పంచాయతీలకు 17 అవాస గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో చాలా వార్డుల్లో, వీధుల్లో వీధిలైట్లు వెలగక, రాత్రిపూట అంధకారంలో జనం అవస్థలు పడుతున్నారు. రాత్రిళ్లు బయటికి రావాలంటే పాములు, తేళ్లు ఎక్కడ కాటేస్తాయోనని భయంతో ఉన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రత్యేక అధికారుల పాలనలో అనేక గ్రామపంచాయతీ సర్పంచులు వీధిలైట్ల కోసం రూ.లక్షల్లో ఖర్చుపెట్టారు. వీధిలైట్ల కొనుగోలు,తాగునీటి బోర్ల మరమ్మతు, డ్రైనేజీ శుభ్రత తదితర వాటికి ఖర్చుపెట్టగా.. బిల్లులు అందక ఆందోళనలో పడ్డారు.  
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -