Thursday, December 25, 2025
E-PAPER
Homeజాతీయంఉన్నావ్‌ అత్యాచార కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఉన్నావ్‌ అత్యాచార కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉన్నావ్‌ అత్యాచార కేసులో బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్‌ సింగ్‌ సెనెగర్‌ జైలు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు అంజలీ పటేల్‌, పూజా శిల్పకర్‌లు పిటిషన్‌ దాఖలు చేశారు. కుల్దీప్‌ సింగ్‌ జీవితం ముగిసేంత వరకు జైలులోనే ఉండాలని ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుడానే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వారు వాదించారు.తీవ్రమైన నేరచరిత్ర, అత్యాచారం వంటి దారుణమైన నేరాల్లో కుల్దీప్‌ సింగ్‌ ప్రమేయం ఉన్నప్పటికీ, ఆయనకు బెయిల్‌ మంజూరుచేయడంలో/శిక్షను నిలిపివేయడంలో హైకోర్టు చట్టపరంగా, వాస్తవంగా తీవ్రమైన తప్పుచేసిందని వాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -