Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్ల కాపర్లపై అకారణంగా దాడి..

గొర్ల కాపర్లపై అకారణంగా దాడి..

- Advertisement -

నీలహళ్లి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన..
నవతెలంగాణ – ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో తాగిన మైకంలో నలుగురు గొర్ల కాపరులపై అకారణంగా దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…
ధరూరు మండలం నీలహళ్లి గ్రామంలో బీడు భూమిలో గొర్లు మేపుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన చిన్న హనుమంతు అనే వ్యక్తి తాగిన మైకంలో అకారణంగా అదే గ్రామానికి చెందిన గొర్ల కాపరులైన నర్సన్ దొడ్డి మునెప్ప, తిక్క వీరన్న, చిన్న జయప్ప, హనుమన్ దొడ్డి మహేష్, పిల్లి రంగప్ప అనే వ్యక్తులపై బూతు మాటలతో దూషిస్తూ వెంబడించి అకారణంగా దాడి చేసి గాయపరిచాడని బాధితులు తెలిపారు.  ఈ ఘటనపై బాధితులు ధరూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -