- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చెత్త నిలవలు పెరిగిపోతున్నాయి. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుండగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సంబంధిత అధికారులు పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించడం లేదనేది తెలుస్తుంది. ప్రధానంగా పట్టణంలోని శివనగర్లో మురుగు కాలువల పై చెత్త నిల్వలు నెలలు గడుస్తున్న తీయడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
- Advertisement -