Sunday, August 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅధర్మ నేరస్థల!

అధర్మ నేరస్థల!

- Advertisement -

న్యాయ స్థానాలలో నేరాలు రుజువవుతాయి. నేరస్తులు శిక్షించబడ తారనీ ఇప్పటికీ చాలామందే నమ్ముతారు. ప్రజాస్వామ్య దేశం మనది, అందరికీ సమానంగా హక్కులు దక్కుతాయీ అని కూడా అనుకుం టాము. ప్రజలెన్నుకున్న నాయకులు, ప్రజల బాగోగులు అన్నీ చూసు కుంటారనీ ఎన్నెన్నో ఆశలున్న, కలలున్న అమాయక అజ్ఞాన అల్పజీవులం మనం. చట్టాలున్నాయి. వాటి ప్రకారమే అన్నీ కొనసాగతాయనే బడి పలుకుల తెలివిడి మనది. కానీ కనపడకుండా జరిగిపోయే నేర సామ్రా జ్యం గురించి మనకు కనీసజ్ఞానం ఎరుక లేకపోయి ఉన్నామనే సంగతిని పాఠంలా చెబు తున్నది కర్నాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రపు సంఘటన. అది మన దేశంలో ఉన్నప్పటికీ, ‘ధర్మస్థల రిపబ్లిక్‌’ అనే పేరుతో డీ గ్యాంగ్‌ పరిపాలిస్తున్న ప్రాంతమని వెలుగులోకి వచ్చేదాకా దేశానికి తెలియదు. దశాబ్దాలుగా ఆ రిపబ్లిక్‌లో వారి న్యాయాలు, చట్టాలే రాజ్యం చేయటం- వాటికి దేశంలోని సామాన్యులు బలికావటమూ ఇప్పుడు కండ్ల ముందుకు వస్తున్న వాస్తవాలు.
”నేను నా స్వహస్తాలతో వందల శవాలను ఈ ధర్మ స్థలలో పూ డ్చివేశాను. బడికెళ్లే అమ్మా యిలు, మహిళలు, సామాన్యులు ఎంతోమంది ప్రాణభయంతో ఇంత కాలం చేశాను. నిజం చెప్పాలని ఇప్పుడు బయటికొచ్చాను. అవి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టానో మీకు చూపిస్తాను. ఎవరు ఈ హత్యలు చేశారో కూడా చెబుతాను. మీరు నా మాటలు నమ్ముతారో లేదోనని, నేను పూడ్చిన ఒక శవాన్ని తవ్వి ఆ ఎముకల ఫొటోలు మీ ముందు పెడుతున్నాను. కారకుల పేర్లు సీల్డ్‌ కవర్లో అందిస్తున్నాను. నేను చెప్పింది తప్పయితే, ఏ శిక్షకయినా సిద్ధం. దయచేసి ఈ నేరాలపై చర్యలు తీసుకోండి” ఇది ధర్మస్థలలోని ఒక పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదు. అతనక్కడ 1995 నుండి 2014 వరకు పనిచేశాడు. తననూ తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించడం వల్ల ఇంతకాలం వెల్లడిం చలేదనీ చెప్పాడతడు. అతను చెప్పే విషయాలు వింటే ఒళ్లు గగుర్పొ డుస్తుంది. భయకంపితులమ వుతా ము.ఆ నేరాలు ఘోరాలు ఆ ప్రాం తవాసులకు కొత్త కాకపోయినా, దేశానికి తెలిసింది మాత్రం ఇప్పుడే.

కర్నాటక మంగుళూరుకు దగ్గరలో ధర్మస్థలలో మంజునాథ ఆలయం చాలా పురాతనమైనది. దాని పక్కనే ఉజిరే అనే గ్రామం, వీటిని ఆనుకుని నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంది. ధర్మస్థలలోని ఆలయం జైనులు నిర్వహణలో కొనసాగుతోంది. ఇక్కడున్న కొందరు పెద్దల కనుసన్నల్లోనే ఈ నేరాలు జరుగుతున్నాయని అక్కడివాళ్లకు తెలుసు. కానీ ఎవరూ వాళ్లని ఎదుర్కొని బతికి బట్టకట్టలేరనే భయంతో ఉంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2001-11 ఈ పదేండ్ల కాలంలో 452 అసహజ మరణాలు ఇక్కడ సంభవించాయి. ధర్మస్థలకు వచ్చిన అమ్మాయిల అపహరించి, లైంగికదాడి చేసి, హత్యలకు పాల్పడిన ఘట నలు కోకొల్లలు. 1986లో పద్మలత అనే అమ్మాయి తండ్రి కమ్యూనిస్టు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కళాశాలకు వెళ్లిన పద్మలత మళ్లీ తిరిగిరాలేదు. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున శవమై తేలింది.ఒక దళిత కుటుంబం కోసం పోరాడినందుకు వారికి శిక్ష అది. పోలీసులు దర్యాప్తులో ఆసక్తి చూపలేదు. అలాగే వేదవల్లి అనే టీచర్‌. తన ప్రమోషన్‌ కోసం కోర్టుకు వెళ్లి తెచ్చుకోవటం, వాళ్లకు అడ్డుగా ఉండ టంతో బాత్రూంలోనే తగులబెట్టారు. మణిపాల్‌లో వైద్య విద్యార్థి అనన్య భట్‌, స్నేహితులతో కలిసి ధర్మస్థల కొచ్చింది. ఆ తర్వాత కనిపించ కుండా పోయింది. తల్లి సుజాత భట్‌ పోలీసులకు ఫిర్యా దు చేసింది. వాళ్లు ఫిర్యా దే తీసుకోలేదు. బిడ్డ కోసం తిరు గుతున్న తల్లిని కొట్టి ఆస్పత్రిలో వేశారు దుండగులు. ఇలా వారానికి రెండు మూడు సంఘటనలు జరుగు తూనే ఉంటాయి. ఆడపిల్లలపైనే కాదు, అక్కడ వాళ్ల కు అడ్డువచ్చే వాళ్లనం దరినీ హతమార్చటం యధేచ్ఛగా జరుగుతోంది.

ఇక్కడి లైంగికదాడులు, హత్యల విషయమై గౌరీలంకేశ్‌ తన పత్రికలో చాలా ఏండ్ల క్రితమే రాశారు. ధర్మస్థల గురించిన కథనాలను ప్రచురించారు. వెంటనే ఆ విలేకరిని చంపేశారు. పద్మలత గురించిన వార్తాపత్రికను పంచే పేపర్‌బారును కూడా చంపేశారు. ఆఖరికి గౌరీ లంకేశ్‌ కూడా హత్యగావింపబడింది. ఎందరో నిజాయితీపరులైన జర్న లిస్టులు హత్య చేయబడ్డారు. లైంగికదాడులు, హత్యలు చేయడమే కాదు, వారి నేర సామ్రాజ్యంలో భూ ఆక్రమణలు, దేవాలయ నిర్వహణ, యాజ మాన్య హక్కులకు సంబంధించిన అంశాలపై వారిదే రాజ్యం. వడ్డీ వ్యాపా రాలు, ముఠా నిర్వహణలు, పైకి బాబాల అవతారాలు. వీళ్లకు స్థానిక రాజ కీయ పార్టీల అండదండలు పుష్కలం. ధర్మస్థల దేవాలయ కేంద్రంగా జరు గుతున్న ఈ నేరాలపై ఇప్పటి వరకూ ఏ సనాతన ధర్మ ప్రచారకులుగానీ, ఆధ్యాత్మిక గురువులుకానీ, మతతత్వ వాదులుకానీ నోరెత్తటం లేదు. ఎంతో ధైర్యంచేసి నిజాలను బయటపెట్టిన పారిశుధ్య కార్మికుని ఫిర్యాదుతో మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేర గురుతులను తవ్వేపని జరుగు తోంది.ఎంత భయానక సంగతులు బయటపడతాయో చూడాలి. ‘ధర్మ స్థల’లో ఎంత అధర్మం, నేరం పోగుబడిందో కొద్దిగానైనా తెలుస్తుందని భావిద్దాం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -