- Advertisement -
కాలికట్ హీరోస్‌పై ఘన విజయం
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్‌లో ముంబయి మీటియర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్‌పై 3-0తో ముంబయి మీటియర్స్ గెలుపొందింది. 15-9, 15-8, 15-12తో వరుస సెట్లలో అలవోక విజయాలు సాధించిన ముంబయి..బలమైన సర్వ్‌లు, కండ్లుచెదిరే స్పైక్‌లతో చెలరేగింది. ముంబయి మీటియర్స్ దూకుడు ముందు కాలికట్ హీరోస్ తేలిపోయింది. తొలి రెండు సెట్లలో తేలిపోయిన కాలికట్.. మూడో సెట్లో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ సీజన్‌లో కాలికట్ హీరోస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.
- Advertisement -