- Advertisement -
6 వికెట్ల తేడాతో యుఏఈపై విజయం
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా గ్రూప్ దశలో అజేయ రికార్డుతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్8కు చేరుకుంది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో యుఏఈపై సఫారీలు 6 వికెట్ల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన యుఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులు చేసింది. అలిషాన్ (45, 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), వసీమ్ (22, 12 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (36), రికెల్టన్ (30), మార్‌క్రామ్ (28) రాణించారు. సఫారీ పేసర్ కార్బిన్ బాచ్ (3/12) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
- Advertisement -



