గాజా : ఆర్థిక సంక్షోభంతో ‘ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్‌ఆర్ డబ్ల్యూఏ)’ గాజాలో పలువురు ఉద్యోగులను తొలగించింది. 2026 బడ్జెట్‌లో 220 మిలియన్ డాలర్లు లోటు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దీంతో గాజాలోని స్థానిక సిబ్బందికి ఈ నెల 20శాతం వేతనంలో కోత విధించనున్నట్టు ప్రకటించింది. పనిగంటలను తగ్గించడంతో పాటు ఈ ప్రాంతం వెలుపల ఉన్న ఉద్యోగుల కోసం ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఆర్థికలోటు తమ సిబ్బందికి చెల్లింపుల నుంచి ప్రతికూల పరిస్థితుల్లో శరణార్థులకు మానవ సేవలను కొనసాగించడం వరకు సంస్థ కీలకమైన ప్రాథమిక బాధ్యతలను నెరవేర్చడంలో తమ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని సిబ్బందికి రాసిన లేఖలో కమిషనర్ జనరల్ ఫిలిప్పె లాజారిని పేర్కొన్నారు. తమ సిబ్బందిపై ఇజ్రాయిల్ ఆరోపణల తర్వాత పలు దేశాలు సంస్థకు నిధులను స్తంభింప చేశాయని, అంతర్జాతీయ సాయంలో భారీగా కోత విధించడంతో ఆర్థిక లోటు ఏర్పడిందని తెలిపారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ పాలస్తీనా శరణార్థులకు అత్యవసర సేవలను అందిస్తుంది. 70శాతం జనాభాకు విద్య, ఆరోగ్య భద్రత, సామాజిక సాయం అందించడంతో పాటు ఇజ్రాయిల్ దాడులు, సరిహద్దు ఆంక్షలు వంటి కీలక సమయాల్లో స్థిరీకరణ శక్తిగా కూడా పనిచేస్తుంది .
గాజాలో ఉద్యోగులను తొలగించిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



