నవతెలంగాణ-హైదరాబాద్: వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందినా ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపడం లేదు. తాజాగా గాజాపై శుక్రవారం జరిపిన దాడుల వల్ల ఏడుగురు చిన్నారులతో సహా 50 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. అలాగే శనివారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఉత్తర గాజాలోని పాలస్తీనియన్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. గాజా నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక ఎత్తైన భవనాన్ని ఇజ్రాయిల్ సైన్యం ధ్వంసం చేసింది.దీంతో అక్కడ కూడా నరక ద్వారాలు తెరుచుకున్నాయని ఇజ్రాయిల్ రక్షణశాఖా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ అన్నారు. శనివారం అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఒక చిన్నారుతో సహా ఐదుగురు మృతి చెందారు. అలాగే అల్ షుహాదా స్క్వేర్‌కు పశ్చిమాన ఉన్న శరణార్ధి శిబిరంపై ఇజ్రాయిల్ సైన్యం బాంబుదాడికి పాల్పడడంతో ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
కాగా, అక్టోబర్ 7, 2023లో మొదలైన గాజాపై ఇజ్రాయిల్ దాడిలో అధికారిక లెక్కల ప్రకారం 64,300 మంది చనిపోయారు. 162,005 మంది గాయాలపాలయ్యారు.
పాలస్తీనాలో ఆగని ఇజ్రాయిల్ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES