- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్: మండలంలోని వివిధ గ్రామాలలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయి ధాన్యం మొలకలెత్తింది.మండల వ్యాప్తంగా వర్షానికి సుమారుగా 70 నుండి 80 ఎకరాల వరిచెను నేలకొరిగింది. ధాన్యం నిల్వ చేసిన రాసులలో కింద భాగం నుండి నీరు వచ్చి సుమారు 1000 నుండి 1500 బస్తాల ధాన్యం తడిసిపోయింది.ధాన్యం రాశులమధ్యలో నీరు నిలిచిపోయింది. రెడ్లరెపాకలో బొడ్డు రాములమ్మ, జువ్వగాని ధనంజయ కు చెందిన 2 ఇండ్లు, వేములకొండలో గాదె మైసమ్మకు చెందిన ఒక ఇల్లు, నాగారంలో గోళ్ల రవి కి చెందిన ఒక ఇల్లు మొత్తం 4 ఇండ్లు కూలిపోయాయి.
- Advertisement -



