Wednesday, May 14, 2025
Homeఖమ్మంఅకాల వర్షం..ఆందోళనలో రైతులు

అకాల వర్షం..ఆందోళనలో రైతులు

- Advertisement -

సకాలంలో కొనుగోలు చేయాలని వినతి….
సోషల్ మీడియాలో ఓ రైతు వాయిస్ వైరల్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: రైతు సేద్యం దినదిన గండం నూరేళ్ళు ఆయుస్సులా ఉంది. అప్పులు, వడ్డీలు ఎలా ఉన్నా చేతికొచ్చిన పంట నోట్లోకి రాలేని వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి. కోత కోసి,ధాన్యం తేమ లేకుండా ఆరబెట్టినా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు రైతు పరిస్థితి దీనంగా తయారైంది. బుధవారం మండలంలోని అచ్యుతాపురం, తిరుములకుంట, మామిళ్ళవారిగూడెం, ఆసుపాక గ్రామాల్లో వర్షం పడింది. దీంతో అచ్యుతాపురం కొనుగోలు కేంద్రం పరిధిలో ఆరబోసిన ధాన్యం ఆకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఈ గ్రామానికి చెందిన కొల్లు చంద్రశేఖర్ అనే రైతు వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ధాన్యం కొనుగోలు చేయించాలని పెట్టి వాయిస్ మెసేజ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. వ్యవసాయ శాఖ మండల అధికారి శివప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం ఈ యాసంగి లో మండలంలో 19 వందల ఎకరాల్లో వరి సాగు చేసారు.ఇప్పటికే 18 వందల ఎకరాలు కోతలు పూర్తి అయ్యాయి. మండలంలో అశ్వారావుపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లి, జమ్మి గూడెం, నారాయణపురం, గుమ్మడి వల్లిలో  ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో ధాన్యం తేమ శాతం తగ్గడానికి రైతులు ఆర బెట్టారు.ఇప్పటికే 50 మంది రైతులకు 120 ఎకరాలు ధాన్యం సేకరణకు కూపన్ లు ఇచ్చారు. అయితే అచ్యుతాపురంతో పాటు పలు కేంద్రాల్లో ధాన్యం తేమ తగ్గి, కొనుగోలు చేసినప్పటికి సకాలంలో ధాన్యం మిల్లులకు చేర్చుకోవడంతో కల్లా లు పైనే ధాన్యం తడి సాయి. బరకాలు, ఇతర రక్షణ ఏర్పాట్లతో ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆవేదనకు గురైన చంద్రశేఖర్ అనే రైతు వాయిస్ మెసేజ్ వాట్సాప్ సమూహాల్లో వైరల్ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -