మండల వ్యాప్తంగా రైతు కన్నీళ్లు..
నవతెలంగాణ – తాడ్వాయి : మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతుల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం రాసులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కేంద్రాల వద్ద ధాన్యం చుట్టూ నీరు నిలిచి స్థానిక రైతులు ధాన్యం ఖరాబై, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తాడ్వాయి, కాటాపూర్, గంగారం, ఎస్ టి కాలనీ, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, బీరెల్లి మిగతా గ్రామాల్లోని రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతం నుండి ప్రారంభమైన వర్షం తెల్లవారి 6 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులు తడిసి ముద్దయిన వారి ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా వడ్లను కొనుగోలు చేసి, తొందర తొందరగా ధాన్యాన్ని తరలించాలని, వెంటనే నష్టాల్లో ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవిధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ రైతులు కోరుతున్నారు.
అకాల వర్షం.. అన్నదాతలు అతలాకుతలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES