సృజనాత్మకతకు కళలు మూలం: ప్రిన్సిపాల్
నవతెలంగాణ – మద్నూర్
సృజనాత్మకతకు కళలు మూలమని ప్రిన్సిపాల్ ఏ సుధాకర్, ప్రముఖపద్యకవి, వ్యాఖ్యాత డా.బి.వెంకట్ ,ఆర్ట్ టీచర్ నరహరిప్రసాద్ లు పేర్కొన్నారు. ముంబై, రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఫర్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటిటేషన్ ఆధ్వర్యంలో మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు చిత్రించిన వివిధ వర్ణచిత్రాలను ఆవిష్కరించారు. ప్రముఖపద్యకవి, చిత్రకారుడు డా.బి.వెంకట్ మాట్లాడుతూ.. కళలెపుడు సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలుస్తాయని అన్నారు. భారతీయ సంస్కృతిలో కళలకు ప్రత్యేక స్థానమున్నదని అన్నారు. లలిత కళలు మనసును ఆనంద పరుస్తాయని అన్నారు. వివిధ రకాలైన రంగులను అద్దటమే చిత్రలేఖనమని అన్నారు.
రాజారవివర్మ తైలవర్ణ చిత్రాలు ప్రపంచంలో ప్రసిద్ధి చెందాయి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు లలిత కళల్లో రాణించాలని అన్నారు. ప్రిన్సిపాల్ ఏ.సుధాకర్ మాట్లాడుతూ.. భారతీయ చిత్రకళకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని అన్నారు. కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ.. భావాలను, ఆలోచనలను వ్యక్తపరిచే చిత్రలేఖనమని తెలిపారు. అన్ని పోటీల్లో బాలురు పాల్గొనాలని అన్నారు. ఆర్ట్ టీచర్ నరహరిప్రసాద్ మాట్లాడుతూ.. చతుషష్టికళల్లో లలిత కళలు చాలా ప్రధానమైనవని అన్నారు. చిత్రలేఖనం, శిల్పము, సంగీతము, నృత్యము, కావ్యము మొదలగుకళలను లలిత కళలంటారని అన్నారు. ఆలోచనశక్తిని ఈ కళలు పెంచుతాయని, విద్యార్థులు ఆసక్తిగా వీటిలో రాణించాలని అన్నారు.
వివిధ చిత్రాల్లో రాణించిన బాలురు వీర..
కొల్లాజ్ చిత్రకళలోకె. చరణ్, 6వ ఐ. నిక్షిత్ రెడ్డి, 7వ జి. విశాల్, 10 వ కలరింగ్ పోటీలో ఎం.లక్ష్మీకాంత్ 5వ ఎం.సాత్విక్, 6వ యస్.సోహమ్, 6వ బి.శివకుమార్.యస్. సాయితేజ 8వ యస్.అభిషేక్, 9 వ సి హెచ్. శివ 9 వ, జే. జ్ఞానేశ్వర్ 10వ.స్కెచింగ్ లోడి. వైభవ్ 8 వ, బి. విక్రమ్ 8వ,కె. ప్రశాంత్ 9 వ,డబ్ల్యూ. విశ్వజిత్ 9 వ,కె. లక్ష్మణ్ 10 కె. ఓంకార్ 10,టాటూ డిజైన్ లో ఎం. దినేష్ 8 వ,కె. సిద్ది రామ్ 10 వ,కార్టూన్ డ్రాయింగ్ లోపి. యశ్వంత్ 8 వ,ఫింగర్ అండ్ థంబ్ పెయింటింగ్ లోబి. రామకృష్ణారెడ్డి 6 వ తరగతుల విద్యార్థులు వారి వారి చిత్రాల్లో ప్రతిభను చూపారు.ఉపాధ్యాయులు-బి.సుమన్,జే.గణేశ్, జి.రాము,బి.సంతోశ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



