Wednesday, October 1, 2025
E-PAPER
Homeఆటలుటెస్టు సవాల్‌కు సై

టెస్టు సవాల్‌కు సై

- Advertisement -

గిల్‌ సేన సాధన షురూ

అహ్మదాబాద్‌ : వెస్టిండీస్‌తో 2 మ్యాచుల టెస్టు సిరీస్‌కు టీమ్‌ ఇండియా సై అంటోంది. ఆసియా కప్‌ విజయంతో సోమవారం స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు నేరుగా తొలి టెస్టు వేదిక అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌లు విశ్రాంతి తీసుకోగా.. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, సాయి సుదర్శన్‌, ప్రసిద్‌ కృష్ణ, ధ్రువ్‌ జురెల్‌, కెఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ సిరాజ్‌, యశస్వి జైస్వాల్‌లు మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్లో చెమటోడ్చారు. చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ తొలుత పిచ్‌ను పరిశీలించాడు. ఆటగాళ్లు సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్‌ సెషన్లో సాధన చేశారు. భారత్‌, వెస్టిండీస్‌ తొలి టెస్టు రేపటి నుంచి అహ్మదాబాద్‌లో ఆరంభం కానుంది. తెలుగు క్రికెటర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌లు రెండు మ్యాచుల్లోనూ తుది జట్టులో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -