నవతెలంగాణ-జహీరాబాద్
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న సేవలపై యూపీకి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించినట్టు జెడ్పీ సీఈవో జానకీరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామ రైతు వేదికలో తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గురువారం ఉదయం 10 గంటల నుంచి వివిధ గ్రామపంచాయతీల్లో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి అవగాహన కల్పించామన్నారు. బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, గృహ నిర్మాణానికి అనుమతులు, తదితర పథకాలు, సేవలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, వాటికి అనుమతులు ఇవ్వడం గురించి వివరించినట్టు చెప్పారు. ట్రైనింగ్ అధికారులు అనిల్ కుమార్, రాఘవేందర్ సవివరంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎన్పీఓ అనిత, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలపై యూపీ బృందానికి అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES