రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూక’. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్‌గా కనిపించనున్నారు. గురువారం ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే ఆంధ్రా కింగ్’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ అవతార్‌లో ఉపేంద్ర అభిమానులకు అభివాదం చేస్తూ కనిపిం చడం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో డై-హార్డ్ సినిమా ఫ్యాన్‌గా రామ్ అలరించబోతున్నారు. ఇది ఒక అభిమాని బయోపిక్‌గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సమర్పకులు: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్-సిరీస్ ఫిలిమ్స్, సీఇఓ : చెర్రీ, సంగీతం: వివేక్, మెర్విన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల.
ఆంధ్రా కింగ్‌గా ఉపేంద్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES