- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ చెల్లింపులు నూతన శిఖరాలను తాకాయి. ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్ నాటికే ఈ లావాదేవీల విలువ రూ.230 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2022-23లో ఇది రూ.139 లక్షల కోట్లుగా ఉండేద న్నారు. ప్రస్తుతం భారత్‌తో పాటు భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ వంటి ఎనిమిది దేశాల్లో యూపీఐ సేవలు అందుబా టులో ఉన్నాయన్నారు. అంతర్జా తీయంగా దీనిని మరింత విస్తరించేందుకు ఆర్బీఐ, ఎన్‌పీసీఐ కృషి చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
- Advertisement -



