No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజిల్లాలుఆర్టీసీ బస్సుల్లో యూపీఐ సేవలు

ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ సేవలు

- Advertisement -

డిజిటల్ ప్రపంచీకరణలో భాగంగా అన్ని రంగాల్లో డిజిటల్ సేవలు
ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ సేవలో అందుబాటులోకి
దీంతో చిల్లర కష్టాలకు చెక్

ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి వివాదాలు దూరం
హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రజలు
నవతెలంగాణ – పెద్ద కొడప్ గల్ 
: ప్రస్తుత కాలంలో ప్రపంచమంతటా డిజిటల్ రంగంతో ముందుకెళ్తుంది. డిజిటల్ ప్రపంచీకరణలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి చిల్లర డబ్బుల కోసం ఎన్నో గొడవలైన సందర్భాలెన్నో. ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సులభతరమైన మార్గాలు కల్పించే భాగంలో యూపీఐ సేవలను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ యూపీఐ సేవలపై తెలంగాణ రాష్ట్ర ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే పెద్ద కొడప్ గల్ మండలం నుంచి బిచ్కుంద కి వెళ్తున్న హైదరాబాద్ బస్సులో ప్రయాణికులు డిజిటల్ యూపీఐ పేమెంట్ ద్వారా బస్సు టికెట్లు తీసుకుంటున్న సందర్భంలో నవ తెలంగాణ క్లిక్ అనిపించింది. ఈ యూపీఐ సేవలపై ప్రయాణకులకు వివరాలు అడగగా మాకు బస్సు సిబ్బందికి గొడవ లేకుండా ఈ సేవలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషమని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad