నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామ దూదేకుల ముస్లిం కమిటీని గురువారం నూతనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు మహమ్మద్ రఫీ, కార్యదర్శిగా అబ్దుల్ ఫారూఖ్ లను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను, దూదేకుల సంఘం సభ్యులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దూదేకుల నూరు భాష రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్, దూదేకుల నూర్ భాషా నిజామబాద్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షాదుల్లా, యూత్ అధ్యక్షులు మహమ్మద్ షారుక్, దూదేకుల నూర్ భాషా హైదరాబాద్ అద్యక్షులు మహమ్మద్ సాదిక్, జిల్లా కార్యవర్గ సభ్యులు సల్మాన్, ఇక్బాల్, అమీర్ సోహెల్, ముషారఫ్, ఆశరాఫ్, ఆదిల్, ఉబేదుల్ రెహమాన్లు, తదితరులు పాల్గొన్నారు.



