Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రిని పరామర్శించిన ఉప్పల వెంకటేష్

మాజీ మంత్రిని పరామర్శించిన ఉప్పల వెంకటేష్

- Advertisement -

నవతెలంగాణ – తలకొండపల్లి
మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం హైదరాబాద్ లోని వారి స్వగృహానికి వెళ్లి సత్య నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. హరీశ్ రావుతోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలోని మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, జేఏసీ ఓయూ కరాటే రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -